Brahmamudi : తప్పించుకున్న నందగోపాల్.. కావ్యకి చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు!
on Dec 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -594 లో.....రాజ్ నందగోపాల్ ని కలవడానికి వెళ్తుంటాడు. అప్పుడే తన పోలీస్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నందగోపాల్ తప్పించుకోవద్దని చెప్తాడు. మరొకవైపు కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. ఏం వంట చేస్తున్నావంటూ రుద్రాణి వస్తుంది. ప్రిడ్జ్ లో ఫ్రూట్స్ లెవ్వు చూసుకోవాలి కదా అంటూ ప్రతీదీ తనని అడుగుతుంది. అన్ని తెప్పించు ఇంటి బాధ్యతలు తీసుకున్నావ్ కదా ఆ మాత్రం చూసుకోవాలి కదా అని కావ్యతో రుద్రాణి అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఇద్దరు కలిసి కావ్యని ఒక అట ఆడుకుంటారు.
ఇంట్లో అది పాడైంది.. ఇది పాడైంది చూసుకోవాలి కదా అంటూ మాట్లాడతారు. అందరికి ఫోన్ చేసి అన్ని బాగా చేపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత బాగా మాట్లాడావ్ ధాన్యలక్ష్మి అని రుద్రాణి అనగానే.. మంచిగ ఉంటే విలువ లేదు ఇలాగే ఉండాలి మనకి రావాల్సిన ఆస్తులు రప్పించుకోవాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత నందగోపాల్ ఇంటికి రాజ్ వస్తాడు. అక్కడ సెక్యూరిటీ లేడని చెప్పడంతో అయ్యో అతనికి డబ్బులు ఇవ్వాలి.. అవి ఇవ్వడం కోసం వచ్చానని రాజ్ అనగానే అవునా అంటూ నందు గోపాల్ అడ్రస్ చెప్తాడు సెక్యూరిటీ. దాంతో రాజ్ కోపంగా బయలుదేర్తాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి డిజైనర్ సారి డిజైన్ చేపించుకుంటుంది. దానికి మూడు లక్షలు కావ్యని అడిగి ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కి నందగోపాల్ అడ్రస్ చెప్పి వాడు తప్పించుకోకూడదని చెప్తాడు. మరొకవైపు నందగోపాల్ కి ఎవరో ఫోన్ చేసి రాజ్ నీ కోసం వస్తున్నాడని చెప్పాగానే అతను పారిపోతాడు. రాజ్ అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ అతను ఇప్పుడే ఫారెన్ వెళ్ళాడని చెప్తాడు.
ఆ తర్వాత రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి దొరికాడా అని అడుగగా.. పారిపోయాడని రాజ్ చెప్తాడు మనం వస్తున్నట్లు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నాడని అతను రాజ్ తో అంటాడు. ఆ తర్వాత స్వప్న షాపింగ్ కి కావ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మీ అక్కకి అయితే ఎందుకు ఏమిటి అని అడగావని రుద్రాణి అనగానే తనపై విరుచుకుపడుతుంది స్వప్న. ఆ తర్వాత రాజ్ సీతారామయ్య షూరిటీ పెట్టిన విషయం తన ఫ్రెండ్ కి చెప్తాడు. తరువాయి భాగంలో ఒక జంటకి ఇందిరాదేవి డబ్బులు ఇస్తే రుద్రాణి ఎందుకు ఇస్తున్నారంటుంది. అయన ఆస్తులు రాసిన ఎవరు అడ్డుచెప్పొద్దని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు కావ్యతో రాజ్ చిరాకుగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read